Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ నేతావత్ వెంకన్న
నవతెలంగాణ-మహబూబాబాద్
కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారు ఆదర్శంగా ఉండి కులరహిత సమాజం కోసం పాటుపడాలని, అంబేద్కర్ కలలు కన్నా కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్త్రీ ల వైద్య నిపుణులు డాక్టర్ నేతావత్ వెంక న్న కోరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో మంగళవారం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆదర్శ వివాహితు ల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం రాగం రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలని, అనేక చైతన్య వంతమైన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంఘాలలో కెవిపిఎస్ కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. రోజురోజుకు దళితు లపై జరుగుతున్న దాడులను అరికట్టుటకు కెవిపిఎస్ అనేక విధాలుగా కృషి చేస్తుందని కొనియాడారు. ప్రేమ వివాహాలు ఎంతో గొప్ప వని కొంతమంది ప్రేమ ను సాకుగా చూపి తమ శారీరక అవసరాలు తీరాక అమ్మాయిలను మోసం చేయ డం మంచి పద్ధతి కాదన్నారు. ప్రేమించిన ప్రతి ఒక్కరు వివాహం చేసుకొని ఎదు టివారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఆదర్శ దంపతులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు చాగంటి ప్రభాకర్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యనమల కిరణ్ దుడ్డెల రామ్మూర్తి, నాయకులు మందుల మహేందర్, శేషం భిక్షం, డివై ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండి రజాక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్, సూర్య ప్రకాష్, మచ్చ వెంకన్న, ఆదర్శ వివాహితులు పాల్గొన్నారు.