Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
కాంగ్రెస్ పార్టీ జఫర్గడ్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బల్లెపూ వెంకట నరసింగరావు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య తెలియజేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల ఐలయ్య ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమా నికి మాజీ మార్కెట్ చైర్మన్ అన్నే యిన బిక్షపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచా ల ఎల్లయ్య, మాజీ జెడ్పిటిసి పట్టపురి సదయ్య గౌడ్ మాట్లాడుతూ జాఫర్గడ్ మేజర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్‌పార్టీ సర్పంచ్ బల్లెపు వెంకట నర్సింగరావు అలి యాస్ నరేష్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అన్నారు. 2018 లో బల్లెపు వెంకటనర్సింగరావు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఐతాను నేను సర్పంచిగా నిలబడతా అనీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇతను సున్నితమైన వ్యక్తి కాదు మాట మీద నిలబడుతని జాఫర్ గడ్ రామాలయంలో మీటింగ్ పెట్టుకో వడం జరిగింది. మీరు వచ్చింది బయట నుండి మీకు ఇక్కడ పరిచయాలు లేవు, మీరు టిఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఆశతో వచ్చారు అనీ అనడం జరిగిందీ. టీఆర్ఎస్ పార్టీ వారు మేము లోకల్ వ్యక్తికే ఇస్తాము నిన్న మొన్న వచ్చిన వ్యక్తు లకు మేము టిక్కెట్ ఇవ్వం అనగానే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. నేను మీ పార్టీ నుండి నిలబడతా నేను రాముని భక్తుడిని బ్రాండ్ పేపర్ రాసిచ్చి నేను రాముని కాళ్ళ ముందు పెడుతున్న నేను సర్పంచ్‌గా గెలిచాక నేను పార్టీ మారాల్సి వస్తే నా సర్పంచ్ పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి లిఖితపూర్వకంగా బాండ్ పేపర్ రాసి రాముని కాళ్ళ దగ్గర పెట్టి ప్రమాణం చెయ్యడం జరిగిందీ. అ లాంటి నీచమైన వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా కుటుంబ సమస్యలు కుటుంబ తగాదాలు తప్ప, పార్టీకి, ఊరుకు సేవ చేసిన సందర్భాలు ఏమీ లేవు, తిడుగులో ల్యాండ్ సమస్యలు జఫర్గడ్లో అసైన్డ్ ల్యాండ్ భూముల సమస్యలు,ఆయన సొంత అవసరాల కోసం నా దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో చొరబడి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకుండా ఉండడం జరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా సుమారుగా 22 లక్షల రూపాయలు గ్రామపంచా యితీలో పనిచేయకుండా అక్రమంగా వాడుకోవడం జరిగింది. కొంతమంది అఖి లపక్షం నాయకులు, దాంతోపాటు ఇదే అదునుగా భావించి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీ యాలని 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జాఫర్గడ్ గ్రామపంచాయతీని పరి పాలిస్తుందని. సర్పంచి అవినీతికి పాల్పడ్డడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారు చెయ్యని తప్పులకు ఆరోపణలు చేస్తున్నారని అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్‌ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి జాఫర్గడ్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఇక్కడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిజాయితీపరులు అయి ఉంటే మీకు ఓటు బ్యాంకు ఉన్నట్టయితే మీరు అవినీతిపరుడు అయినటువంటి సర్పంచిని తీసుకోవడానికి ప్రయత్నం చేసి నట్లు అయితే మీకు ధైర్యం ఉంటే గుండె మీద చేయి వేసుకొని సర్పంచ్ నరసింగ రావుని సర్పంచ్ పదవికి రాజీనామా చేయించి ఓట్లలో నిలబెట్టండి మేము కనీసం గుర్తింపు లేనటువంటి వ్యక్తిని తీసుకువచ్చి నిలబెట్టి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండేటట్టు చేస్తాం, కానీ పక్కదారి పట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినటువంటి వారిని చేర్చుకొని పైసలు అక్రమంగా సంపాదించుతున్నా అవినీతి పరులకు బుద్ధిచేప్పుతామనీ అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ స్టేషన్గ న్పూర్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్, ఉప సర్పంచ్ నంచర్ల లత యాదగిరి, వార్డ్ మెంబర్స్ మంచాల మమత అనిల్, కుక్కల ఎల్లయ్య, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మామిడాల సోమనారాయణ, మండ ల అధికార ప్రతినిధి ఎండి హబీబ్ ఖాన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ముక్తార్ అలీ, మాజీ సర్పంచ్ వెంకన్న, సముద్రాల సత్యనారాయణ, నీలం రాజయ్య, లం రాజు, మెరుగు రాజు,పెర్మయ్య మైదం విజరు, సిద్ధం లింగయ్య, మామిడాల మధుబాబు, జిట్టబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు.