Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్/దేవరుప్పుల
ఉచిత కుట్టు శిక్షణతో మహిళలకు ఉపాధి అవ కాశాలు లభిస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళ వారం మండలంలోని నాంచారి మడూర్ గ్రామంలో జరుగుతున్న ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని సందర్శిం చారు. మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ము ఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో 5 కోట్ల 10 లక్షల రూపాయలతో 3 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా శిక్షణ కొనసాగుతుండగా, మంత్రి ఎర్రబెల్లి ఆయా శిక్షణా కేంద్రాలను స్వయం గా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మ హిళలతో కొద్దిసేపు మాట్లాడారు. శిక్షణ జరుగుతున్న తీరుని పరిశీలించారు. మహిళల కోరిక మేరకు వారి తో ఫోటోలు దిగారు. అలాగే శిక్షణకు గైర్హాజరైన మ హిళలతో ఫోన్లో మంత్రి మాట్లాడారు. హలో...! నేను శిక్షణ ఇస్తున్న సార్ను... మీరు ఇవ్వాళ ఎందుకు రాలే దంటూ ప్రశ్నించారు. మీకు బదులు మరొకరిని పెట్ట మని మీ ఎమ్మెల్యే చెప్పారు. మీ మంత్రి ఆదేశించారు అంటూ ప్రశ్నించారు. వారి సమాధానాలు విన్నాక... నేను తెలుసా అంటూ ప్రశ్నించారు. అందరిలోనూ న వ్వులు పూయించారు. అనంతరం మంత్రి మాట్లాడు తూ శిక్షణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కోరారు. శిక్షణ అనంతరం ఉపాధి, ఉద్యోగావకాశా లకు భరోసా ఇచ్చారు. కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ గుం టుక యాదలక్ష్మి, యాకయ్య, ఎంపీటీసీ కుంభం సుకన్య, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షులు బిందు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్య క్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, శ్రీరామ్ సుధీర్, ఉప సర్పంచ్ శ్రీరామ్ రాము, పార్టీ అధ్యక్షు డు బోనగిరి లింగమూర్తి, ఏపీఎం నరేంద్ర కుమార్, కుమారస్వామి, సమ్మయ్య, అంజయ్య, ఉపేందర్, అనిల్, మనోజ్, మహేష్ పాల్గొన్నారు.