Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి - తమ్మెర విశ్వేశ్వరరావు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
నవతెలంగాణ-తొర్రూరు
భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆదానీల రహ స్య ఒప్పందాలను బహిర్గతంచేయాలని, ఆదాని ఆస్తు లు వేలం వేయాలని, సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళ వారం సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా స్థానిక ఎస్బిఐ, ఎల్ఐసి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. దేశప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తున్నారు అని ఆరోపించారు. ఆదాని ఆర్థిక సామ్రాజ్యం గాలి బుడగ లాంటిదని అది అవినీతి పునాదులపై నిర్మించిన సామ్రాజ్యం అని, నిజమైన పెట్టుబడులు లేని సట్ట వ్యాపారం స్టాక్ మార్కెట్ ద్వారా నిర్మించబడ్డ వ్యాపారం అని,హెడెన్ బర్గ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆదాని గుట్టు రట్టయిందని తెలిపారు. ఎల్ఐసి సంస్థ 80 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 5300 కోట్లు, నేషనల్ బ్యాంకు నుండి 7వేల కోట్లు, ఎస్బిఐ నుండి 25 వేల కోట్లు అనేక బ్యాంకుల నుండి ఆదాని కంపెనీలకు నరేంద్ర మోడీ ఆదేశాలతో అప్పులు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే వివిధ సంస్థల దగ్గర తీసుకున్న 10 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయని ఈ అవినీతిని నిర్మూలించకుంటే దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించి భారత దేశ భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోని గ్రూప్ ఆస్తులన్నీ వేలం వేసి దేశాన్ని కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యద ర్శి గట్టు శ్రీమన్నారాయణ, మండల సహయ కారద ర్శులు బందు మహేందర్, మంగళపల్లి మల్లయ్య, వీరన్న, యకాంతం,గణపురం లక్ష్మణ్,యాకయ్య, శ్రీనివాస్, కృష్ణ ,పి ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.