Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
జిల్లా కోర్టులో పనిచేస్తున్న పదకొండు మంది శా నిటేషన్ కార్మికులను అక్రమంగాతొలగించిన కాంట్రా క్టర్ను వెంటనే శిక్షించాలని దళితులను తొలగించిన ఆ కాంట్రాక్టర్ పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రజక వత్తిదారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండ ఏకశిలా పా ర్కువద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్న శిబిరాన్ని సంద ర్శించి 8వ రోజు పూలమాలలు వేసి దీక్షలను ప్రారం భించారు. అనంతరం మాట్లాడుతూ 2014 సంవత్స రం నుండి పనిచేస్తున్న కార్మికులకు 2020-21 సంవత్సరంలో పిఎఫ్, ఈఎస్ఐ కట్టకుండా కాంట్రా క్టర్ మోసం చేశాడని పీఎఫ్ డబ్బులు అడిగినందుకు పాతవారైన 11 మంది కార్మికులను అక్రమంగా తొల గించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు వేల రూపాయలకే పనిచేస్తున్న కార్మికులను పీఎఫ్ డబ్బు లు అడిగినందుకు మీరు పని చేయడం లేదని తొల గించి కొత్తవారిని పనిలో పెట్టుకొని కక్ష సాధింపు ధో రణి అవలంబిస్తు న్నారని అన్నారు. శానిటేషన్ వర్క ర్లుగా కూడా దళితులు పని కిరాకుండా కనీస అవస రాలు తీర్చుకోవడానికైనా పని దొరకని విధంగా కాం ట్రాక్టర్ వ్యవహరిస్తున్నా రని ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్మికుల బకాయి లను చెల్లించి. వారిని పనిలోకి తీసుకోవాలని లేనిచో రజక వృత్తిదారుల సంఘం హనుమకొండ జిల్లా కమి టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు సురేం దర్, మేకల రజిత, స్వరూప, వినోద, పద్మ, సుకన్య, పుష్పలత దీక్షలో పాల్గొనగా సీఐటీయూ జిల్లా నాయ కులు వ్యాస బాబా, పొట్టలపెల్లి రాజు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.