Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.05 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామా ల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తూ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని భూపా లపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని మైలారం, జోగంపల్లి, కొప్పుల, వసం తపూర్, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం గ్రా మాల్లో రూ.85లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు, గ్రా వెల్ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతితో కలి సి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి పాల్గొని శంకుస్థాపన లు చేశారు. సూర్యనా య క్తండా గ్రామంలో ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో చేపట్టనున్న గ్రామపంచాయతీ భవ న నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శరవేగం గా అభివృద్ధితోపాటు, అనేక సంక్షేమ పథకాలను పా రదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అతి త క్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివద్ధి వె ౖపు పరుగులు పెట్టించిన గొప్పనాయకుడు సీఎం కేసీ ఆర్ అని కొనియాడారు.
అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథ కంలో మంజూరైన 16మంది లబ్ధిదారులకు మంజూ రైన చెక్కులను అందజేశారు. కళ్యాణ లక్ష్మి పథకం ని రుపేదలకు వరమన్నారు.
నూతన వధూవరులకు ఆశీర్వాదం
మైలారం గ్రామానికి చెందిన బీసీ సెల్ కార్యద ర్శి మోతే కరుణా సమ్మయ్య కుమార్తె భవాని హరీష్ దంపతులను, కర్రు లింగమ్మ ఆగయ్య దంపతుల కుమారుడు మహేష్ సంఘవి దంపతులను ఆశీర్వ దించారు. జోగంపల్లికి చెందిన ఇజ్జగిరి గోపాల్, వ సంతపూర్ ఇటికాల రాజేశ్వర్‌లు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట ఎంపీపీ మెరుపు తిరుపతిరెడ్డి, వైస్‌ఎంపీపీ రామ్ శెట్టి లతా లక్ష్మారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మ నోహర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.