Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం వ్యవసాయ మార్కె ట్ కమిటీలో కార్మిక వర్గం నుంచి ఒక డైరెక్టర్ పోస్టు కేటాయించాలని ఏఐ సిటియు జిల్లా అధ్యక్షుడు కంచ వెం కన్న డిమాండ్ చేశారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శి అమరలింగేశ్వరరావుకు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కంచ వెంకన్న మాట్లాడుతూ మార్కెట్ అధ్యయన యాత్రలో భాగంగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహారాష్ట్రలోని సాంగ్లీ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించిన ట్లు తెలిపారు. సాంగ్లీ వ్యవసాయ మార్కెట్లో కార్మిక వర్గం నుంచి ఒక డైరెక్టర్ పో స్టును కేటాయించారని వివరించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో కార్మిక వర్గాల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కార్మిక వర్గాల నుంచి ఒక డైరెక్టర్ పో స్టు ఎంతో అవసరమన్నారు. కార్మికుల తరఫున మార్కెట్ కమిటీలో తమ సమస్య లను విన్నవించుకునేందుకు కమిటీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రాతినిధ్యం వహిం చేందుకు డైరెక్టర్ ఉండాలన్నారు. ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు చొరవ చూపి కార్మికుల సంక్షేమం దృష్ట్యా కమిటీలో చోటుకల్పించాలని కోరారు. ఈ కార్య క్రమంలో బానోత్ కిషన్, నేరడ వీరస్వామి, బానోత్ వీరు, చిన్నా, నిమ్మరబోయిన వెంకన్న, బానోత్ సురేష్, భద్రు, తేజావత్ లచ్చు, బాదావత్ యాకూబ్, మల్లమ్మ, ఎల్లమ్మ, భూలక్ష్మి, నాగేంద్ర, పద్మ,రజిత, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.