Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మనుస్మృతిని వ్యతిరేకిస్తూ బుధవారం హనుమకొండలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్ర మం చేపట్టారు. దేశ ప్రజల విచ్ఛిన్నానికి ఉపయోగపడే మనుస్మృతిని వ్యతిరేకిం చాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. ఈ కార్యక్ర మానికి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శిమందసంపదత్ హాజరై మాట్లాడారు. భార త రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో మార్పు చేయాలనే కుట్ర బిజెపి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి వారి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అడుగుజా డల్లో ప్రజలందరికీ ఇబ్బందులు కలిగించే మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొ స్తూ ఈరోజు ప్రవేశపెట్టడం అనేది భారత రాజ్యాంగాన్ని ముమ్మాటికి రద్దు చేయడ మే అని అన్నారు. అంతే కాకుండా ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులపై, అత్యాచారాలు, దాడులు, కుల, దుహంకార హ త్యలు, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనేకం జరుగుతూనే ఉన్నాయన్నారు. అంబేద్కర్ భావాలు కలిగిన వారు సమాజం పట్ల శాస్త్రీయమైన ఆలోచన కలిగిన వారిని విద్యావంతులని మేధావులని భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహాలని కూల్చివేయడం లాంటిఅనేక అసంఘాకిక కార్యక్రమాలు చేస్తున్న పట్టించుకోవడంలేదని అలాగే భారత రాజ్యాంగం అమల్లో ఉంటేనే భారత రా జ్యాంగాన్ని కాపాడితేనే అన్ని కులాలకి మతాలకి వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ స్వేచ్ఛగా సమానంగా జీవిస్తారని అన్నారు.
ఎప్పుడో పూర్వకాలపు మన ధర్మ శాస్త్రాలు రెండు వేల పైచిలుకు ఉన్న శ్లోకా లు ముందుకు తీసుకురావడం ప్రజల మధ్య చీలిక తీసుకురావడం కోసం విభజిం చి ప్రజల్ని వేరువేరుగా కులాలుగా, మతాలుగా చూడడం వల్ల ప్రజల ఐక్యత అభి వృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యు లు కనకం కావ్యశ్రీ,హర్షం రామ్కి, శోభ, విజయ్, మధుకర్, చందర్, తదితరులు కేవీపీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.