Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
లింగనిర్ధారణ పరీక్షలు చేసిన, చట్టాన్ని వ్యతిరే కించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంట ర్లో పైన కఠిన చర్యలు ఉంటాయని హనుమకొండ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జి ల్లా కలెక్టర్, వైద్యఆరోగ్యశాఖ అధికారి సూచన మేరకు ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యాకుబ్ పాష ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని టార్గెట్ డయా గస్టిక్స్, ఉదరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ డయాగస్టిక్స్ ,సిగ్మా హాస్పిటల్‌లోని స్కానింగ్ కేంద్రా లపై తనిఖీలను నిర్వహించారు. ఈ తనికెల్లో పత్రాల ను పరిశీలించి నెలలో ఎంతమంది గర్భిణీ లకు స్కా నింగ్చేశారో వారి వివరాలను రికార్డుల్లో ప రిశీలించా రు. ఈ సందర్భంగా యాకుబ్‌పాషా మా ట్లాడుతూ గర్భిణీలకు స్కానింగ్ చేసే సమయంలో అనుమతిం చిన వైద్యులు మాత్రమే ఉండాలని గర్భంలోని బిడ్డ లింగ నిర్ధారణ చేస్తే చర్యలు ఉంటాయనీ అన్నారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్ష లు చేయడం, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ చేసిన, రికార్డులను సరియైన విధంగా మైంటైన్ చేయకున్నా చట్ట ప్రకారంగా చర్యలు తీసు కుంటామని అదే విధంగా అటువంటి స్కానింగ్ సెం టర్లను మూసి వేయడం జరుగుతుందని డాక్టర్ యాకూబ్ పాషా పేర్కొన్నా రు. అంతే కాకుండా గర్భి ణీలకు స్కానింగ్ చేస్తున్న సమయంలో అనుమ తిం చిన డాక్టర్లు మాత్రమే చే యాలని ఎంతమంది గర్భి ణీలకు స్కానింగ్ పరీక్షలు జరపడం జరిగిందో అట్టి వివరాలు ఫారం ఎఫ్ లో పొందుపరిచి అదే రోజు ఆన్లైన్ చేసి ప్రతి నెల 5లోపు డిఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
స్కానింగ్ సెంటర్లు ఖచ్చితంగా లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఫిర్యాదుల కొరకు104,1098, 100 టోల్‌ఫ్రీ నెంబర్ కలిగి ఉన్న బోర్డులను స్కా నింగ్ రూమ్‌లో, విజిటర్కూర్చునే ప్రదేశంలో ఏర్పా టు చేయాలని, పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అని ఎవరైనా అడిగినట్లయితే వారి వివరాలను, మధ్యవ ర్తులు ఎవరైనా సంప్రదిస్తే వారి వివరాలను జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ కార్యాలయానికి తెలియచే యాలని ఆయన పేర్కొన్నారు.ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి వేముల అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో కొప్పు ప్రసాద్, టి. మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.