Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
బాల్య వివాహాల నిర్మూలనతోనే బాలికల సాధికారత సాధ్యమవుతుందని, బాల్య వివాహాల రహిత జిల్లాగా ములు గుకు పేరు తీసుకురావాలని, అందుకు అంగన్వాడీ టీచర్లు సైనికుల్లా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రేమలత అధ్యక్షతన జిల్లా బాలల పరిరక్షణ విభాగొ సమన్వయంతో బాల్య వివాహాల నిషేధం -2006, అక్రమ దత్తత నిషేధ చట్టాలపై ఆయా మండలాల అంగన్వాడీ టీచర్లు, చైల్డ్ లైన్, బాలల పరి రక్షణ సభ్యులు, ఇతర డిపార్టుమెంట్స్ క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ కరోనా సమయం లో అంగన్వాడీ టీచర్ల సేవలు వెలకట్టేలేనవన్నారు. అక్రమ దత్తత అనేది బాలల హక్కులకు గొడ్డలిపెట్టులా మారుతున్నాయని వెళ్ల డించారు. బాలల హక్కులను పరిరక్షించడానికి అంకిత భావంతో పని చేయాలని సూచించారు. బాల్య వివాహానికి గురైన బాలికలు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా సామాజికంగా ఎదుగుదల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుండటం బాధాకరమన్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇంకా బాల్యవివాహాలు జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో అక్రమ దత్తత కేసులు కూడా పెరుగుతుండటం ఆలోచించాల్సిన విషయం అన్నా రు. చట్టబద్దం కాని అక్రమ దత్తతను తీసుకోవడం మూలం గా సదరు పిల్లలకు చట్టపరంగా రావాల్సిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉదన్నారు. గృహ సందర్శణ కార్యక్రమాన్ని చేపట్టి బాల్య వివాహాలు, అక్రమ దత్తత, వర్నకట్న వేధింపులు, కిషోర బాలికల ఎదుగుదల లాంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్య వంతులు చేయాలని కోరారు. జిల్లా సంక్షేమ అధికారిణి ప్రేమలత మాట్లాడుతూ... విలేజ్ చైల్డ్ ప్రోటక్షన్ కమిట ీ(వీసీపీసీ) లను మరింత బలోపేతం చేయాలన్నారు. బాలల హక్కులను కాపాడటంలో అందరం భాగస్వాములు కావాల న్నారు. వీసీపీసీ కమిటీలు జిల్లాలో 174 ఏర్పాటు చేశామని, దీనిద్వారా బాలలపై జరుగుతున్న అన్యాయాలు, బాల్య వివా హాలు, పరిరక్షణ పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికష్ణ, సీడీపీఓ హేమలత, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కష్ణవైణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, చైల్డ్‌లైన్ టీం సభ్యులు రమ్య, సుదర్శన్, జయమ్మ పాల్గొన్నారు.