Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ- తాడ్వాయి
క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లా సానికి తోడ్పడతాయని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం 'బొల్లెపల్లి పూర్వీకుల జ్ఞాపకార్ధం' వాలీబాల్ టోర్నమెంట్ స్థానిక సర్పంచ్ ఊకే మోహన్రావు ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి 24 25చ 26 తేదీలలో నిర్వహించనున్న సందర్భంగా, స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు క్రీడాకారులకు వాలీ బాల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజ మని, ఓడినవారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు చదువుతోపాటు మానసిక పునరుత్తేజానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. విద్యార్థి దశ నుండి చదువుతో పాటు క్రీడలు మిళితం చేస్తేనే విద్యార్థులను మానసికంగా శారీరకంగా ధఢంగా తయారవుతా రన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయస్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని అన్నారు. క్రీడల వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యా తలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో నవయుగ యూత్ అధ్యక్షులు పూణెం నాగేశ్, చేల ప్రదీప్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.