Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లింపులు చేస్తున్న మహిళలు తీరు స్ఫూర్తిదా యకమని ఎస్బిఐ మేనేజర్ ధర్మరాజు అన్నారు. బుదవారం ఎస్బిఐ బ్యాంకు మహా లాగిన్ డే సంధ ర్భంగా వెలుగు మండల సమైక్య ఏపిఎం రవివర్మను బ్యాంకు మేనేజర్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహిళ లకు సూచించారు. స్వయం సహాయక సంఘ సభ్యుల కు తమ వ్యాపార విస్తరణ, వివిధ రకాల ఆదాయ మార్గాల కొరకు బ్యాంకు ఎప్పుడు హితోదికంగా ముం దుంటుందని అన్నారు. బ్యాంకు పరిధి స్వయం సహాయక సంఘాలు 100శాతం రుణాలను తిరిగి చెల్లింపులు చేస్తున్నాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి వివో ఏలు లు మహిపాల్, శంకర్, పావని, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు..