Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందనాయక్
నవతెలంగాణ-గోవిందరావుపేట
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్లో మండల అధ్యక్షులు సురపనేని సాయికుమార్ అధ్యక్షతన నర్వహించిన బీఆర్ఎస్ విస్తృతసాయి సమావేశంలో గోవిందు నాయక్ మాట్లాడారు. మండలంలో పోడు భూముల విషయంలో గిరిజనులు, గిరిజనేతరులు పట్టాలు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి ములుగు జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ సహకారంతో మంత్రి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గుండ్లవాగు ప్రాజెక్టుభూములు కోల్పోయిన రైతులకు పరిహారం కోసం ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి సమస్యకు పరిష్కారం చూప్తామన్నారు. చల్వయి గ్రామం వద్ద పోలిస్ ఫిఫ్త్ బెటాలియన్ క్యాంపు ఏర్పాటు, డబల్ బెడ్ రూమ్ విషయంలో ఇల్లు లేని వారికి రూ.3లక్షల కేటాయింపు కింద మం డలానికి ఎక్కువ శాతం నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి సిసి రోడ్ల నిమిత్తం రూ.4కోట్ల10లక్షలు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే సీతక్క రెండు సార్లు గెలిచి కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోగా అభివద్ధి పనులను చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. పాదయాత్రల పేరి ట ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నా రు. మండలంలోని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ములుగు జిల్లాలో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట రైతు సమన్యాయ సమితి అధ్యక్షులు పెన్నింటి మధుసూదన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్,అధికార ప్రతినిధి భూ రేటి మధుసూదన్ రెడ్డి, గోవిందరావుపేట సోషల్ మీడియా ఇంచార్జ్ పథ్వీరాజ్ ఉట్ల, ఎంపీటీసీలు గోవిందరావుపేట వైస్ ఎంపీపీ సూది రెడ్డి స్వప్న లక్ష్మ రెడ్డి రామచందర్, శ్రీనివాసరావు, సర్పంచ్ల ఫోరం గోవిందరావుపేట అధ్యక్షులు మోహన్ రాథోడ్, ఉప సర్పంచ్ అల్లం నేని హనుమంతురావు, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.