Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర బృందానికి సమస్యలు విన్నవించుకున్న కార్మికులు
నవతెలంగాణ-జనగామ డెస్క్
గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూని యన్(సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అద్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది పాదయాత్ర చేపట్టిన విషయం విధితమే. పాలకుర్తి నుంచి పట్నం వరకు చేపట్టిన పాదయాత్రకు జీపీ కార్మికుల నుంచి సమస్యలు వెల్లువలా వస్తున్నాయి. ఈ నెల 12న తెలంగాణ సాయిధ పోరాటంలో రక్తంతో తడిసిన గడ్డ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్‌గాందీ చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర అమరుల స్పూర్తితో పాలకుర్తి, స్టేషన్గణపుర్, జనగామ నియోజక వర్గంలోని నాలుగ మండలాలు, 27 గ్రామల గుండా 75 కిలోమీటర్లు సాగింది. బుధవారం జనగామ జిల్లా పరిధి పెంబర్తి గ్రామం దాటి యాదాద్రి బోనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. పాద యాత్ర పాలడుగు భాస్కర్ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వేంకటయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ పి గణపతి రెడ్డి, నాయకులు తూనికి మహెష్, పి వినోద్ కుమారులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఆయా గ్రామల నుంచి సాగిన పాదయాత్ర బృందానికి వివిధ పంచాయతీల్లోని కార్మికులు అనేక సమస్యలతో కూడిన వినతి పవ్రతన్ని అందజేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే తమకు ఒక కార్మికుని వేతనాన్ని ఇద్దరు పంచుకునే పరిస్థితి ఉందని, దీంతో వేతనం సరిపోక చాలీ చాలని బతుకులు వేల్లదీస్తున్నామని విన్నవించుకున్నారు. దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పడ్డ శీత్యాతండా, లక్ష్మణ్ తండా, పడమటి తండ పంచాయీతీల కార్మికుల వేతనాలు 6 నెలలుగా చెల్లించడం లేదని బాధతో చెప్పుకున్నారు. ఆయా గ్రామాలకు క్రీడా ప్రాంగణం, నర్సరీ, స్మశాన వాటికలకు ప్రభుత్వ భూములు లేని గ్రామాలలో భూముల దానం చేసిన వారి కుటుంభాల సభ్యులను పనిలోకి తీసుకోని అప్పటి వరకు పనిచేసిన కార్మికులను తొలగిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాదయాత్ర బృందానికి పార్టీలకు అతీతంగా జెండాలతో సంబంధం లేకుండా సమస్యల ప్రాతిపదికన జీపీ కార్మికులు వారి వారి మస్యలపై వినతి పత్రం ఇస్తూ పాదయాత్రకు మద్దతు తెలిపారు.
కనీస వేతనాలు చెల్లించాలి : పాదయాత్ర రథసారథి పాలడుగు భాస్కర్
పాదయాత్ర బుదవారం జనగామ జిల్లా పరిది దాటి యాదాద్రి భువణగిరి జిల్లాకో ప్రవేశిస్తున్న సందర్భంగా పెంబర్తి వద్ద పాదయాత్ర రథసారధి పాలడుగు భాస్కర్ పెంబర్తి వద్ద నవతెలంగాణాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జీఓ 51ని విడుదల చేసి 500 జనాబాకు ఒకరి చొప్పున లెక్కించి వారికి రూ.8500 వేతనం నిర్ణయించిందన్నారు. అదనంగా ఉన్న కార్మికులకు ఎలాఎంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఒకరికి ఇచ్చే వేతనాన్నే అందరు పంచుకోవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. వీరికి కనీస వేతనం రూ.26000 చెల్లించాలన్నారు. ఈలోపు మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్టు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి జీఓ 60 ప్రకారం చెల్లించాలన్నారు. పారిశుద్య కార్మికులకు రూ.15600 చెల్లించాలని, కోరోబార్, బిల్కలెక్టర్లకు రూ.19500చెల్లించాలన్నారు. మల్టీపర్ప్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మల్టీపర్సస్ విధానాన్ని రద్దు చేలిన గ్రెడింద్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 51 ద్వారా గౌరవ ప్రదంగా గడిపిన కారోబార్ల జీవితం మల్టీపర్పస్ వర్కర్స్ విధానంతో అద్వాన్నాంగా మారిందన్నారు. గ్రామ పంతాయీతీ కార్మికులకు తిరిగి కెటగీరి వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. క్యాటగిరీలు అమలు చేసి అర్హులైన కార్మికులకు పదోన్నతులు కల్పించాలన్నారు.