Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హన్మకొండ/సుబేదారి
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఉప సభాపతిగా నియమితులైన బండా ప్రకాష్ బహు ముఖ ప్రజ్ఞాశాలి ఆని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఇటీవల రాష్ట్ర శాసనమండలి ఉప సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన బండా ప్రకాష్ మొదటిసారిగా వరంగల్ విచ్చేసిన సందర్భంగా హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినరు భాస్కర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బసవరాజ్ సారయ్య, వరంగల్ ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ హాజరై బండా ప్రకాష్‌ను సన్మానిం చారు. అనంతరం దాస్యం వినయభాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాకు 8 ఎమ్మెల్సీలు రెండు మంత్రి పదవులు ఒక ప్రభుత్వ చీఫ్‌తో పాటు ఇప్పుడు ఉప సభాపతి పదవి కూడా ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. వరంగల్ జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో 12 సీట్లు గెలిపించి కానుక ఇవ్వాలని కోరారు. బండా ప్రకాష్ ఒక విప్లవకారుడు అని 40 సంవత్సరాలు కాంగ్రెస్ లో పనిచేసిన ఒక్క పదవి కూడా రాలేదని అన్నారు. బీఆర్ఎస్లో మాత్రం అతి తక్కువ కాలంలో పార్లమెంటు ఎమ్మెల్సీగా ఇప్పుడు క్యాబినెట్ హౌదా గల ఉపసభాపతి పదవి ఇచ్చి వరంగల్‌కు సముచత స్థానం కల్పించారని అన్నారు. బండా ప్రకాష్ ముదిరాజుల అభ్యున్నత కోసం ఎల్లప్పుడూ పాటుపడతారని అన్నారు. చీఫ్‌విప్ వినరుభాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా పై ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. వరంగల్ జిల్లాకు రాజకీయంగా అనేక పదవులు ఇచ్చారని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేటకు అధిక నిధులు ఇచ్చి ముదిరాజులను కాపాడుకోవా లని అన్నారు. అనంతరం ఉపసభాపతి బండ ప్రకాష్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ 1982 నుండి ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి సుపరిచితులు అని అన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ సార్ కూడా కేసీఆర్ తెలంగాణ సాధిస్తాడని ముందే ఊహించాడని అన్నారు. బీఆర్ఎస్లో తాను 2016లో చేరానని, కేసీఆర్‌ను ఎప్పుడూ పదవులు అడగలేదని అన్నారు. అయినా ఇంత గౌరవప్రదమైన పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముదిరాజుల అందరికీ ద్విచక్ర వాహనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, సోదా కిరణ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.