Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లికి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
హనుమకొండ జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాల్లో సుమారు 8500మంది ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, వారికి జీఓ-58 ప్రకారం పట్టాలిచ్చి పక్కా గహాలు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జిల్లా కమిటీ ప్రతినిధి బందం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బోట్ల చక్రపాణి మా ట్లాడారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తుంటే వాటి ని రక్షించి పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. మంత్రి జోక్యం చేసుకొని నిలువ నీడలేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలను రక్షించి ఆదుకో వాలని కోరారు. ఈ భూపోరాటాల సందర్బంగా నాయకులూ, గుడిసెవాసులపై పెడు తున్న కేసులను ఎత్తివేయాలని కోరారు. గతంలో ప్రభుత్వ భూములను రక్షించి, పోరాటాలు చేసి 30వేలమంది కుటుంబాలకు పట్టాలిప్పించిన చరిత్ర సీపీఐ (ఎం) ఉందని అన్నారు. పేరుమోసిన హయగ్రీవాచారి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వెలికి తీసి సుప్రీం కోర్టు వరకు పోరాడి సాధించి ప్రభుత్వానికి అప్పచెప్పిన చరిత్ర సీపీఐ(ఎం)దేనని అన్నారు. పేదలు గుడిసెలు వేసుకున్న భూములను కలెక్టర్ దష్టికి తీసుకెళ్లి సర్వే చేసి పేదలకు పట్టాలిప్పించాలని కోరారు. ఇందుకు మంత్రి స్పందించి ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చినట్టు తెలిపారు. పార్టీ జిల్లా నాయకులు జి ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్, మంద సంపత్, భాను నాయక్, కాడబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.