Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రంగాపురం, ఇస్సిపేట, మేదరమెట్ల, అంకుషాపురం, మొగుళ్ళ పల్లి గ్రామాల్లో సుమారు రూ.కోటి40లక్షలతో అభివద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ,రైతు బంధు పెట్టుబడి సహాయం, రైతు అకాల మరణం సంభ విస్తే 5 లక్షల రైతు భీమా సౌకర్యం వంటివి అభి వృద్ధి చెందిన దేశాల్లో లేనటువంటి గొప్ప పథకా లన్నారు. అన్ని వర్గాల వారికి పెన్షన్ అందించి భరోసా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుం దన్నారు. గ్రామాల అభివద్ధికి తాగునీటి సమస్య తీర్చడంలో, వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా, విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, ఆరోగ్య విషయంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో తదితర వాటిలో వెనక్కి తగ్గకుండా అనేక కార్యాక్ర మాలు చేపడుతుందన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం అనేక నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. అనంతరం మండలకేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక దష్టి లోపం ఉన్న వారికి డిప్యూటీ డీిఎంహెచ్‌ఓ కొమురయ్య, డాక్టర్ నాగరాణి, నవత ఆధ్వర్యంలో కళ్ళద్దాలను అంద జేశారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించు కోని కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జోరుక సదయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరావు, పీఏసీఎస్ చైర్మన్ నరసింగరావు, సర్పంచ్‌లు ధర్మారావు, సునీత రమేష్, అరవింద్‌రెడ్డి, చంద్రమౌళి, డీఈ ఆత్మారావు, పీఆర్ ఏఈ రమేష్ బాబు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
వైస్ ఎంపీపీకి పరామర్శ
మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ పోలునేని రాజేశ్వర్‌రావు ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగింది. హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి రాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి బుధవారం నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.