Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహాదేవపూర్, సూరారం గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డుకిరువైపులా నాటిన హరితహారం మొక్కలను ఎంపీడీవో శంకర్ నాయక్, ఏపీఓ రమేష్ బుధవారం పరిశీలించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌కు పలు సూచనలుచేశారు. ప్రతి వారం మొక్కలకు నీరు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా పట్టించాలన్నారు. మొక్కల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు వాచర్ల సహాయంతో తొలగిం చాలని, హరితహారం కార్యక్రమం కింద నాటిన ప్రతి ఒక్క మొక్క బతికి ఉండే టట్లు గ్రామపంచాయతీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.