Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్లో స్టేట్ లెవెల్ విజేతలుగా నిలిచి నేషనల్‌కు ఎంపికైన కబడ్డీ క్రీడాకారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం సత్కరించారు. జిల్లా యువజన క్రీడా కార్యాలయం 2022-23 సంవత్సరానికి గాను గత ఆగస్టున నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్స్‌లో ములుగు జిల్లా విజేతలను ఎల్బీ స్టేడియం స్టేట్ సెలక్షన్ కు పంపారు. నేషనల్‌కు ఎంపికైన ములుగు జిల్లా నుండి మంగపేట జడ్పిహెచ్ఎస్కు చెందిన శ్రీరాములు, సతీష్ కుమార్, ఏటూర్ నాగారం ఐటీడీఏ ఈఈ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కే లక్ష్మీనారాయణను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి పీవీఆర్ చారి, లావణ్య, కోచ్ కుమారస్వామి పాల్గొన్నారు.