Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
కేటీకే ఓ సి త్రీ ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ లో జరిగిన ప్రమాదానికి మైనింగ్ ఉద్యోగులను బాధ్యులను చేస్తూ ప్రకాష్ అనే మైనింగ్ ఉద్యోగిని డిస్మిస్ చేసినందుకు నిరసనగా బుధవారం సింగరేణి ఓసి త్రీ లో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మైనింగ్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాన్ని ఉదతం చేస్తామన్నారు. నేడు జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలన్నారు. ప్రమాదం జరిగిన సంఘటనకు మైనింగ్ ఉద్యోగులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఉద్యోగులను డిస్టిస్ చేయడం మానుకోవాలని కోరారు.