Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
నూతనంగా ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ గాష్ ఆలంను ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ, ఎంఎస్పి జిల్లా కోఆర్డినేటర్ ఇరుగు పైడి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపారు.ఈ సంధర్భంగా ఎంఅర్పిఎస్ చేస్తున్న ఉద్యమాల గురించి, సామాజిక సమస్యలపై చేస్తున్న పోరాటం గురించి చర్చించారు. జిల్లాలోని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు తగిన చొరవ తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో ఏంఎస్పి ములుగు జిల్లా సీనియర్ నేత మడిపెల్లి శ్యామ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తోకల రాంబాబు మాదిగ,ఎంఎస్పి నాయకులు ఇరుగు ఆజాద్ తదితరులు ఉన్నారు.