Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
కలెక్టర్ కార్యాలయంలో గురువారం స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యను మర్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నియోజకవర్గంలోని స్టేషన్గన్పూర్ మండలం కొత్తపల్లి, చిల్పూరు మండలము పల్లగుట్ట, లింగాలగణపురం మండలం కళ్లెం గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మిగతా గ్రా మాల్లో మంజూరై అసంపూర్తి నిర్మాణ దశలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఇంకా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణాలు ప్రారంభం కానీ గ్రామాల్లో సైతం నిర్మాణాలు ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిప దికన ల్యాండ్ అలాట్మెంట్ చేయడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా పూర్తి చేసేందుకు సంబంధిత మండల తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో చిలుపూరు గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, నియోజకవర్గం కోఆర్డినేటర్ కెసిరెడ్డి మనోజ్ రెడ్డి, నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ తదితరులు ఉన్నారు.