Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ డెస్క్
ప్రముఖ పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీన రసింహస్వామి ఆలయంలో చండిక అమ్మవారి ప్రతిష్ట గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితోపాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, నర్సంపేట, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, జనగామ జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెలి మాట్లాడుతూ ఈనెల 17 నుండి 21 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మౌత్సవాల సందర్భంగా ఆలయంలో చంద్రిక అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే పాలకుర్తి జాతరను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. బ్రహ్మౌత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, ప్రధాన అర్చకులు దేవగిరి రామన్న, కార్యనిర్వహణ అధికారి నండూరి రజని కుమారి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.