Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ డెస్క్
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభి వద్ధి చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా పాలకుర్తిలో మంత్రిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి జంగా రాఘవరెడ్డి తోడు దొంగలని విమర్శించారు. ప్రజలు 2018 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని, అలాంటి వ్యక్తులు ప్రజల మనిషి దయాకర్ రావును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న అభివద్ధి పట్ల జంగా రాఘవరెడ్డి చేస్తున్న అవినీతి పట్ల బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. చెన్నూరు పాలకుర్తి రిజర్వా యర్ల ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు మంత్రి ఎర్రబెల్లి కషి చేస్తున్నాడన్నారు. ఈ సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి,తొర్రూర్ సొసైటీల చైర్మన్లు బొబ్బల అశోక్ రెడ్డి, గోనే మైసిరెడ్డి, బిఆర్ఎస్ అధికార ప్రతినిధి లావుడియా మల్లు నాయక్, మండల సంయుక్త కార్యదర్శి దొంతమల్ల గణేష్, ఉపసర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్,మండల అధ్యక్షుడు ఆకారపు ఉపేందర్, బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య తో పాటు డిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.