Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి
నవతెలంగాణ- మహాదేవపూర్
రైతుల పేర్లు చెప్పి ఎరువుల దుకాణాలు తెరిచి ఎక్కువ రేట్లకు పురుగుల మందులు అమ్ముతూ అదే రైతులను మోసం చేస్తూ ఉంటే వ్యవసాయ ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారని మహాదేవ పూర్ పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి మండిపడ్డారు. గురువారం ఎంపీపీ రాణి బారు రామారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ఆరోకోరగా హజరైన సభ్యులు , ఆఫీసర్లతో సాగిన సమావేశం లో ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పటిలాగే చేస్తాం చూస్తాం అంటూ ఆఫీసర్లు మాటలు చెప్పారని ప్రజా ప్రతినిధులు వాపోయారు. 1100 రూపాయలు కు అమ్మాల్సిన పత్తి కి కొట్టే పురుగుల మందులు రూ.2500 నుండి రూ.3000 వరకు అమ్ముతున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. డీసిఎంఎస్ ఎరువులు పక్కదారి పడుతున్నాయని రైతులకు న్యాయం చేయాల్సింది పోయి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు వారితో కుమ్మక్కై రైతుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ఓ విషయంపై ఓ గ్రామ సర్పంచ్‌ను, ఎంపీటీసీని గ్రామంలోని సమస్యలపై వచ్చిన విషయం పై ఎంపీపీ వివరణ అడగగా వారు తమకు అవగాహన లేదని తెలపడం విశేషం. ఏకంగా ఓ గ్రామ సర్పంచ్ ఐతే వ్యవహారాలన్నీ మా ఆయన చూసు కుంటాడు అని చెప్పగా ఎంపీపీ తో సహా సభికులందరూ నవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. సమాజంలో మహిళా ప్రజా ప్రతినిదుల పై జరుగుతున్న అన్యాయాన్ని సభికులందరూ సమర్దిన్చినట్టు అయింది. మహిళ అయి ఉండి కనీసం ఆ విషయాన్ని వ్యతిరేకించని ఎంపీపీ పై పలువురు ఇదెక్కడి చోద్యమని ముక్కున వేలేసుకున్నారు.