Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టా త్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంతోనే ని రుపేదలకు మేలు జరుగుతుందని వర్దన్నపేట ఎమ్మె ల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ 66వ డివిజన్ కేంద్రం ప్రభుత్వ పాఠశాలలోగురువారం కంటి వెలు గు రెండవవిడత శిబిరాన్ని ఆయన ప్రారంభిం చి మా ట్లాడారు. ముందుగా కంటి చూపు పరీక్షలకి వచ్చిన వారు వైద్యసిబ్బందికి సహకరించి పరీక్షలు చేయించు కోవాలన్నారు. నెల రోజుల పాటు కంటి పరీక్షలు ని ర్వహిస్తారని, అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు, తదితర శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తారని తెలి పారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ నోడల్ ఆఫీస ర్ వాణిశ్రీ మాట్లాడుతూ డాక్టర్ విజయరాజు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ప్రభుదాసు, డాక్టర్ అనూష, డాక్టర్ పద్మారాణి, డాక్టర్ జయపాల్ల పర్యవేక్షణలో పంచా యతీ గ్రామాలతో పాటు కార్పోరేషన్ విలీన గ్రామా ల ప్రజలకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో 5,026 మంది కి కంటి పరీక్షలు నిర్వహిం చి 892 మందికి కంటి అ ద్దాలను అందజేశామని, ఇంకా 510 మందికి కావా ల్సిన అద్దాలను తయారు చేసేందుకు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు ప్ర తీకేంద్రంలో 180 నుంచి 200 మందికి కంటి పరీ క్షలు నిర్వహించాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు గురుమూ ర్తి శివకుమార్, గుగులోతు దివ్యరాణిరాజునాయక్, ఆత్మ చైర్మెన్ కందుకూరి చంద్రమోహన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు హరికుమార్, మోకెనపల్లి రాజుకుమార్, సూపర్వైజర్లు లక్ష్మన్, ఆఫ్తాల్మాలజిస్టు శివనందిని, డీఈఓ సునిత, రాధిక, ఎల్పీహెచ్ కందుకూరి సం తోష్, సులోచన, సుకన్య, రజిత, విజయనిర్మల, ఆశా లుశైలజ,ఉమ,రాజేశ్వరీ, పుష్ప, ఆర్పీలు పాల్గొన్నారు.