Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ-వరంగల్
రెండు పడకగదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పోడు భూములు, 58, 59, 76, 118 ప్రభుత్వ జిఓ ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, తెలంగాణ కు హరితహారం, రెండు పడక గదుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి స మీక్షించారు. చీఫ్ సెక్రెటరీ మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలకు కంటి వెలుగు క ళ్ళద్దాల పంపిణీ జరుగు తుందని, రాష్ట్రంలో జీహె చ్ ఎంసీ మినహా యించి పట్టణ ప్రాంతాలలో నిర్మిం చిన 42వేలకు పైగా రెం డు పడక గదుల ఇండ్ల ని ర్మాణాల లబ్ధిదారులను కే టాయింపు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 6 వేల 620 మాత్రమే జరిగిందని, ఫిబ్రవరి 26 నాటికి పెం డింగ్‌లో ఉన్న ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి వివరాలు ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలని అన్నారు. ప్రభుత్వం అందించిన ఫ్రోఫార్మా 1 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమాచారం త్వరితగతిన అందించాలని, అధికారులు వారి దగ్గర ఉన్న సమా చారం మేరకు నివేదిక తయారు చేయాలని, పోడు భూముల పట్టాల పంపిణీ కొరకు జిల్లా స్థాయి కమి టీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు త్వరగా ఆ మోదించాలని సూచించారు.జిల్లాలో ఆమోదించిన దరఖాస్తులో పట్టాదారు ఫోటో, ఇతర వివరాలు పాలి గాన్ చెక్ చేసి, సరిగ్గా ఉన్న దరఖాస్తులు వెంటనే పట్టాపాస్ పుస్తకాల ముద్రణకు పంపాలని, తెలంగా ణకు హరితహారం కింద వచ్చే సంవత్సరంలో అవస రమైన మొక్కల పెంపకం నర్సరీలో పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలు పక్కాగా జరిగేలా ప్రణా ళిక సిద్ధం చేయాలని, వేసవిని దష్టిలో పెట్టుకొని మొ క్కల సంరక్షణ అవసరమైన చర్యలు తీసుకో వాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జీఓ 58 ప్రకారం ఆమోదిం చిన దరఖాస్తుదారుల పట్టాలను స్థానిక మంత్రి, ప్ర జా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ, ధవీకరణ పూ ర్తి చేయాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తి కావాలని అన్నారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, డీ ఎఫ్ వో అర్పణ, తదితరులు పాల్గొన్నారు.