Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మండల ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకుని ఆర్థికం గా ఎదగాలని వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ధర్మసా గర్ బ్రాంచ్ మేనేజర్ వెంకటేష్ అ న్నారు. గురువారం నాబార్డ్ వారి ఆర్థిక సౌజన్యంతో మండలంలోని జానకిపురం గ్రామంలో మండల కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు గురువా రం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాకారులతో బ్యాంకు అంది స్తున్న సేవలు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు అందిస్తున్న డిపాజిట్పథకం సహకార మిత్ర 499 రోజులకు అత్యధి కంగా 8 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.లక్ష కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే 8.1 శాతం వడ్డీ అందిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. బ్యాం కు అందిస్తున్న దీర్ఘకాలిక రుణాలు కోళ్లు,గొర్రెలు,గేదెల పెంపకం ట్రాక్టరు, హార్వె స్టర్ కొనుగోలు, విద్యార్థులకు ఉన్నత చదువులకు విద్యార్ణములు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిజిఎం కురువ ఏఎంజి బాలకష్ణ పాల్గొన్నారు.