Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్
నవతెలంగాణ-కురవి
గ్రామపంచాయితీ కార్మికులకు కనీసఉద్యోగ భ ద్రత, సౌకర్యాలు కల్పనకై డిమాండ్ చేస్తూ ఈ నెల 20న మండల కేంద్రం కురవి నుండి మహబూబాబా ద్ జిల్లా కలేక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర ని ర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ తెలిపారు. గురువారం మండల కేంద్రం లో తెలంగాణ గ్రామ పం చాయితీ యూనియన్ (సి ఐటియు) జిల్లాస్థాయి స మావేశం ఉపేంద్రాచారీ అ ధ్యక్షతన జరిగింది. ఈ స మావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకులరాజు, కుంట ఉపేం దర్లు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రా మ పంచాయితీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్రంలో అన్నిరకాల ఉద్యోగులకు, ఇతర కార్మికుల కు వేతనాలు పెంచి ఒక్కగ్రామ పంచాయితీ కార్మికు లకు మాత్రమే పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచకపో వడం విడ్డూరంగా ఉందని, జిపి కార్మికులను చిన్న చూపుచూడటం బాధాకరంగా ఉందని తక్షణమే వారికి ఉద్యోగభద్రత, ప్రమాదబీమా, రెగ్యులర్ ఉద్యో గుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని డి మాండ్ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది కార్మి కు ల డిమాండ్ల సాధనకోసం సీఐటీయూ ఆ ధ్వర్యంలో పాలకుర్తి నుండి ప్రారంభమైన రాష్ట్ర పాదయాత్రలో భాగంగా జిల్లా పాదయాత్ర ఈనెల 20న కురవి నుం డి ప్రారంభిస్తున్నామని, జిల్లాలోని గ్రామపంచాయ తీ కార్మికులు అందరూ కురవికి తరలిరావాలని పిలు పునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ పోతుంగంటి మల్లయ్య, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.అశోక్, బి.అప్పిరెడ్డి, డి.సుధాకర్, రామచంద్రయ్య, శ్రీను, ముజేందర్, సు మన్, వెంకటలక్ష్మి, యస్.కే.లతీఫ్, కుమారస్వామి, వెంకటదాసు, జానిమియా, మంగిలాల్, ఎల్లయ్య, కనకలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.