Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కళ్యాణ లక్ష్మితో నిరుపేదింట్లో కళ్యాణ కాంతులు వెలుగుతున్నాయని ఇల్లందు ఎమ్మెల్యే బానో త్ హరి ప్రియనాయక్ అన్నారు.గురువారం మండలంలో మంజూరైన 19మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చె క్కులను ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయ క్, జిల్లా జెడ్పీ చైర్మన్ బిందునాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదింట్లో ఆడపడుచులు ఘనం గా పెళ్లి జరుపుకోవాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రూ.50 వేల రూపా యలు ఉన్న కళ్యాణ లక్ష్మి నేడు అంచెలంచెలుగా పథ కంలోని డబ్బులు రెట్టింపు చేస్తూ నేడు రూ.1,00, 116లు తెలంగాణ లబ్ధిద్నాలకు అందజేయడం గొ ప్ప విషయమన్నారు. నిరుపేద కుటుంబంలో కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ కాంతులు నిండాయన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ చేపూరి మౌనిక, మండల వైస్ ఎం పీపీ తాతా గణేష్ , ఎంపీ డీవో చలపతిరావు, తహశీ ల్దార్ రమేష్, రైతు సమన్వ య జిల్లా కమిటీ సభ్యులు సోమిరెడ్డి, ప్రజా ప్రతినిధు లు,సర్పంచులు, ఎంపీటీసీ లు నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.
శుభకార్యంలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్
మండల కేంద్రంలోని వీబీఎన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు అడిదెల వీరభద్రం కుమార్తె వివాహ నిశ్చతార్థం వేడుకకు ఇల్లందు శాసన సభ్యులు బానోత్ హరిప్రియ నాయక్, జిల్లా జడ్పీ చైర్మన్ బిందు నాయక్ హాజరై కాబోయే వధూ వరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేపురి మౌనిక, వైస్ ఎంపీపీ తాత గణేష్, జిల్లా నాయకులు ఆంగోత్ శ్రీకాంత్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్, సర్పంచ్ దనసరి కోటమ్మ, ఎంపీటీసీ శైలజ రెడ్డి, ఉప సర్పంచ్ వీరబోయిన కవిత, ఎంపిటిసి వజ్జ భద్రయ్య, సొసైటీ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు కొండ్రెడ్డి సోమిరెడ్డి, నాయకులు బానోత్ మురళి కష్ణ, తమ్మిశెట్టి వెంకటపతి, జరుపుల శ్రీనివాస్, బానోత్ లక్ష్మణ్ నాయక్, రెపాకుల వెంకన్న, ఇస్లావత్ వీరన్న, చెరుకుపల్లి నర్సయ్య, తొట్టి కష్ణ, పూర్ణ చందర్ రెడ్డి, బానొత్ మంత్రియ తదితరులు పాల్గొన్నారు.