Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబాబాద్ జిల్లాకు చేరిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర
నవతెలంగాణ-పెద్దవంగర
అధికారంలోకి వస్తే రాజన్న సంక్షేమ పరిపాలన అందిస్తామని వై ఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్షర్మిల అన్నారు. ప్రజాప్ర స్థానం పాదయాత్ర మహబూబాబా ద్ జిల్లా పెద్దవంగర మండలం, అవు తాపురం గ్రామంలోకి గురువారం ప్రవేశించింది. మహిళలు, కార్యకర్త లు పెద్దఎత్తున షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికారు. గ్రామంలోని ప్ర ధాన చౌరస్తాలో షర్మిల తన తండ్రి వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని ఆ విష్కరించారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో తీవ్రఅసంతప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగా లు లేక పీజీ పట్టాలతో రోడ్లమీద తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనం దోచుకోవడమే కేసీఆర్ నైజమని, రాష్ట్రంలో కేవలం ఆయన కుటుంబమే బంగారు తెలంగాణగా మారిందన్నారు. గ్రామంలోవైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుపై దుష్ప్రచారం చేసిన ఓ దినపత్రికపై మండిపడ్డారు. నిజాన్ని అబద్ధాలుగా గ్లోబల్ ప్రచారం చేయడంలో ఆ పత్రిక దిట్ట అని, కేసీఆర్ భజన కోసమే పని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో వైయస్సార్ విగ్రహాం ఏర్పాటును తొలుత బీ ఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, గ్రామ మహిళలే నిలువరించి, చలిమంటలతో రాత్రంతా కాపలా కాసి, వైయస్సార్ మీద అభిమానంతో విగ్రహం కట్టించారని పేర్కొన్నారు. దీనికి వైఎస్సార్ బిడ్డగా పడుతున్నానని తెలిపారు. మ హిళల పోరాట స్ఫూర్తికి ఆమె అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రా ష్ట్రంలోని నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాడని దుయ్యబట్టరు. లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న, కేవలం 43 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుప ుకున్నాడని విమర్శించారు. రైతులకు 40వేలు సబ్సిడీ ఇచ్చే పథకాలను రద్దు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు.
రైతులు రూ. 5వేలతో ఎలా కోటీశ్వరులు అవుతారని ప్రశ్నించారు? డబుల్ బెడ్రూం, రుణమాఫీ ఊసే లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగ భతి ఇస్తానని చెప్పి యువతను, ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి రైతులను కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. మంత్రి దయాకర్ రావు కబ్జా కోరని, నియోజకవర్గంలో ఆయన చేసిన అభివద్ధి శూన్యం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. పాద యాత్రలో అడుగడుగున సమస్యలేనని, వైఎస్సార్టీపీ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ పాలన అందిస్తా మని వ్యాఖ్యానించారు. మళ్లీ రాజశేఖర్రెడ్డి పథకాలకు జీవం పోస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది వృద్ధులు, వికలాంగులు, వి తంతువులు ఉంటే వారందరికీ రూ.3వేల పిం ఛన్ అందిస్తామని అన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీ పైనే తొలి సంతకం చేస్తామని అ న్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ బిడ్డగా తనకు ప్రజలు చూపిస్తున్న ఆద రణ, ప్రేమకు రుణపడిఉంటానని, ఆడబిడ్డను ఆదరించాలన్నారు.
238 రోజులు, 3800 కిలోమీటర్ల పాదయాత్ర
ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం మహ బూబాబాద్ జిల్లాలో ప్రారం భమైంది. ఉదయం 10:30 గంటలకు జనగామ జిల్లా పాల కుర్తి మండలం, రేగు ల నుండి జిల్లా పరి ధి లోని అవుతాపురం గ్రామానికి చేరు కుంది. వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షురాలు సుజాత మంగీలాల్, విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నీలం రమేష్, నాయ కు లు, మహి ళలు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు.