Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు వినతి పత్రం
- సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గురువారం రోజున హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ నివాసంలో ఎమ్మెల్యే కి సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ ప్రతినిధి బందం పెదాలు వేసుకున్న గుడిసెలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి మాట్లాడుతూ జిల్లా లో 12 కేంద్రాలలో 'సుమారు 8500 మంది ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, వారికి జి.ఓ నుంబర్ 58 ప్రకారం పట్టాలిచ్చి, పక్క గహా లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూములలో రియల్ ఎస్టేట్ దారులు కబ్జాలకు చేస్తుంటే వాటిని రక్షించి పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. నిలువ నీడలేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలను రక్షించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ని కోరారు. ఈ భూపోరాటాల సందర్బంగా నాయకులూ, గుడిసెవాసులపై పెడుతున్న కేసులను ఎత్తివేయాలని కోరారు. గతంలో ప్రభుత్వ భూములను రక్షించి, పోరాటాలు చేసి 30 వేల మంది కుటుంబాలకు పట్టాలిప్పించినా చరిత్ర సిపిఎం పార్టీ దని పేరుమోసిన హయగ్రీవాచారి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వెలికి తీసి, సుప్రీం కోర్టు వరకు పోరాడి సాధించి ప్రభుత్వానికి అప్పచెప్పిన చరిత్ర సిపిఎం పార్టీ దని అన్నారు కేంద్రాలలో వేసుకున్న భూములను కలెక్టర్ దష్టి కి తీసుకెళ్లి , సర్వ్ చేసి పేదలకు పట్టాలిప్పించాలని ఎమ్మెల్యే ని కోరగా ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దష్టి కి తీసుకెళ్తానని హామీ ఇచ్చార నారు . సిపిఎం ప్రతినిధి బందంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవ రెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, వాంకుడోత్ వీరన్న మంద సంపత్, తదితరులు పాల్గొన్నారు.