Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-హనుమకొండ
హనుమకొండ ఆర్టిసి బస్ స్టాండ్ విస్తరణ, ఆధునికరణ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ అన్నారు. గురువారం ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ వి.సి సజ్జనార్ తో కలిసి బస్ స్టాండ్ అభివద్ధి, సుందరీకరణపై సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం బస్ స్టాండ్ పరిసరాలలో కలియతిరుగుతూ ప్రయాణికులతో ఆర్.టి.సి అందిస్తున్న సేవల గురించి తెలుసుకుంటూ అనంతరం చేపట్టాల్సిన అభివద్ధి పనులను సజ్జనార్ దష్టికి చీఫ్ విప్ తీసుకెళ్లారు. 13 ఎకరాల్లో ఉన్న హనుమకొండ బస్ స్టాండ్ నుండి వివిధ డిపోలు చెందిన 1600 ల బస్సులు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేస్తూ ప్రజా రవాణాలో అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తున్నాయని చీఫ్‌విప్ అన్నారు. దాదాపు 45 ఏండ్ల క్రితం నిర్మించబడ్డ హనుమకొండ బస్ స్టాండ్ ను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికరించాల్సిన అవసరం ఉందని తప్పకుండా ఆర్.టి.సి అభివద్ధిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్,సంబంధిత మంత్రి అజరు కుమార్ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సంస్థ ఎండి సజ్జనార్ ల చొరవతో హనుమకొండ ఆర్టిసి బస్ స్టాండు ను చాలా సుందరంగా తీర్చిదిద్దుతామని వినరు భాస్కర్ అన్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్,ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజా రవాణాకు ప్రాణం లాంటి ఆర్టిసి పరిరక్షణ మనందరి బాధ్యతాయని, సంస్థ అభివద్ధికి వినూత్నమైన విధానాలతో ముందుకు సాగుతూ సంస్థ అభివద్ధికి ఉద్యోగులు కషి చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని పలు ముఖ్య బస్ స్టాండ్లను ఇప్పటికే గొప్పగా తీర్చిదిద్దడం జరిగిందని అలాగే హనుమకొండ బస్ స్టాండ్ విస్తరణ, అభివద్ధి గొప్పగా చేపడుతామని అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సజ్జనార్ ఆర్టిసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య,రీజనల్ మేనేజర్ శ్రీలత,అధికారులు తదితరులు పాల్గొన్నారు.