Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు
ప్రజా ప్రతినిధుల అండతోనే అక్రమ మొరం దందా
లక్షలు ఆర్జిస్తున్న అక్రమార్కులు
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని లోక్యతండా గ్రామ పరిథిలో జోరుగా అక్రమ మొరం దందా జరుగుతున్న మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. అక్రమ మొరం దందా వెనుక బడా ప్రజాప్రతినిధుల అండ ఉన్నట్లు అందుకే మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారుల పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉండడంతో అక్రమ మొరం దందా వ్యాపారం జోరుగా జరుగుతుందని ప్రజల మద్య జోరుగా ప్రచారం జరుగుతుంది. అక్రమ వ్యాపారులు లక్షలు ఆర్జిస్తున్న పరిస్థితి. అక్రమ మొరం దందాకు పాల్పడుతున్న వ్యక్తులు పట్టుబడినప్పుడు అధికారులు కఠినచర్యలు తీసుకొనక పోవడంతో లోక్యతండా గ్రామ పరిథితో పాటు మండల వ్యాప్తంగా అక్రమ మొరం దందా వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. బుధవారం మిట్టమధ్యాహ్నం అక్రమ మొరం దందా యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం. 2021 మే నెలలో లోక్యతండా గ్రామ శివారు ప్రభుత్వ భూమిలో అక్రమ మొరం దందా కవరేజికి వెళ్లిన మీడియా పై దాడిచేసిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అప్పుడు అక్రమ మొరం దందాకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోక పోవడం అక్రమ మొరం దందాకు పాల్పడే వారికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివద్ది పనుల పేరిట లక్షల విలువ చేసే మొరాన్ని తరలించారు. అభివద్ది పనులకు కూడా మొరం తవ్వకాలకు కాంట్రాక్టర్లు మైనింగ్, రెవెన్యూ అనుమతులు తీసుకోవాలని నిబంధనలు తెలుపుతున్నాయి. ఇప్పటికైనా లోక్యతండా గ్రామ పరిథితో పాటు మండలవ్యాప్తంగా అధికారులు పర్యవేక్షణ చేసి అక్రమ మొరం దందాకు పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకొని, మండల వ్యాప్తంగా అక్రమ మొరందందా పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యతతోపాటు. అక్రమార్కులకు బడానాయకుల అండదండలు ఉన్నా కఠినచర్యలు తీసుకోవాల్సిన బాద్యత అధికారులపై ఉందని పలువురు మండల ప్రజలు అంటున్నారు.