Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఆలోచనలతో సంస్థ వద్దికి పాటుపడాలి
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
నవతెలంగాణ-హన్మకొండ
ఆర్టీసీ సిబ్బంది ఎప్పటికప్పడు తమ పనితనం మెరుగు పరుచుకుంటూ సంస్థ వద్ధికి పాటుపడాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ కొత్త ఆలోచనలు చేయాలన్నారు. వరంగల్ రీజియన్ అధికా రులతో స్థానిక ఆర్ఎం కార్యాలయంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజియన్ పనితీరు, రూట్ల క్రమబద్దీకరణ, లాభనష్టాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ప్రయా ణికులు, సిబ్బంది ఆర్టీసీకి రెండు కండ్లు లాంటివని సంస్థ వీరిద్దరికి ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క సి బ్బంది నిబద్దతతో పనిచేయాలని సూచించారు. టీఎస్ఆ ర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లని వారిని క్షేమంగా గమ్యస్థానా లకు చేర్చాల్సిన బాధ్యత మనపై ఉందనే విషయం మరిచి పోవద్దన్నారు. గత ఏడాది ప్రయాణికులు సంస్థను మంచి గా ఆదరించారని గుర్తు చేశారు. అంతకుముందు హన్మకొం డ బస్టాండ్‌ను పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటిం చారు. బస్సుల్లో కల్పిస్తోన్న సౌకర్యాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరిం తగా ప్రోత్సహించాలని, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ఇతరులకు చెప్పాలని వారిని కోరారు. అనంతరం హన్మకొం డ బస్టాండ్ విస్తరణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొ రేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ పి.ప్రావీణ్య, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ సుందరరాజ్ యాదవ్‌తో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. విస్తరణపనుల పురోగతిపై వారితో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. గతంతో పోల్చితే హన్మకొండ బస్టాండ్‌లో ప్రయా ణికుల రద్దీ పెరిగిందన్నారు. విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచిం చారు. అత్యాధునిక హంగులతో కూడిన ప్లాట్‌ఫాంలను అం దుబాటులో ఉంచాలని చెప్పారు. అలాగే వరంగల్-1, 2 డిపోలను ఎండీ సజ్జనర్ గారు సందర్శించి అందులోని వివి ధ విభాగాలను పరిశీలించారు. సిబ్బందితో ప్రత్యేకంగా స మావేశమై డిపోల పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. ఏసీ బస్సులను శుద్ధి చేసే విధానాన్ని ఆవిష్కరించిన సిబ్బం దిని ఈ సందర్భంగా ప్రశంసించారు. నూతన ఆవిష్కరణలు చేసే ఉద్యోగులను సంస్థ ప్రోత్సహిస్తుందని చెప్పారు.
టీఎస్ఆర్టీసీకి సహకరించండి...
టీఎస్ఆర్టీసీకి సహకరించాలని వరంగల్, హన్మకొండ జిల్లాల అధికారులను ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను స్వయంగా కలిశారు. వరంగల్ సీపీ రంగనాథ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ బీ.గోపి, హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్వీనిలను కలిశారు. ఈ కార్యక్రమాల్లో టీఎస్ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, కరీంనగర్ ఈడీ వి.వెంకటేశ్వర్లు, వరంగల్ ఆర్ఎం జే.శ్రీలత పాల్గొన్నారు.