Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీసీ చైర్మెన్ సతీష్ కుమార్
నవతెలంగాణ-వెంకటాపురం
బాలల సంరక్షణ అందరి బాధ్యత అని వారి హక్కుల సంరక్షణకు అధికారులు సమన్వయం తో పనిచేయాలని ఎంపీపీ, ఎంసీపీసీ ఛైర్మెన్ చెరుకూరి సతీష్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రం లో ఎంపీడీఓ బాబు అధ్యక్షతన బాలల సంరక్షణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ కమిటీని ఎంపిక చేశారు.ఎంపీపీసీ అధ్యక్షులుగా ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. బాలల హక్కుల ఉల్లంఘనకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికా రులందరిపై ఉందని అన్నారు. బాల్యవివాహాలు, బాల కార్మికులు వంటి బాలల హక్కుల ఉల్లంఘనలు జర గకుండా చూడాలన్నారు. అనంతరం శిరీష మాట్లా డుతూ దేశం లోనే వినూత్నంగా తెలంగాణ రాష్ట్రం లో బాల రక్షా భవన్ వ్యవస్థను 2019 నుండి ప్రారం భించడం జరిగిందని తెలిపారు. బాలలకు సంబం ధించిన అన్ని రకాల సేవలు ఒకే గొడుగు కింద అందేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో అన్ని లైన్ డిపార్ట్మెంట్ ల అధికారుల సహకారం అవసరమని అన్నారు. మండల బాలల పరిరక్షణ కమిటీ ప్రతీ రెండు నెలలకి ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము ప్రొటెక్షన్ అధికారి హరికష్ణ పరిరక్షణ కమిటీ యొక్క విధులు, నిర్వర్తిం చాల్సిన భాధ్యతలు, ఉత్తమ బాలల పరిరక్షణ కమిటీ పాటించాల్సిన సూచికలను గురించి వివరించారు. అనంతరం బాల్యవివాహాల నిషేధ చట్టం - 2006 అక్రమ దత్తత నిషేధం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ హనుమంతరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి, సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఎంపీటీసీలు రాజ కుమారి, సుదర్శన్, జయసుధ, తదితరులు పాల్గొన్నారు.
బాలల సంరక్షణ నూతన కమిటీ
చైర్మన్‌గా ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్, కార్యదర్శిగా ఎంపీడీిఓ బాబు, కన్వీనర్‌గా సీడీపీఓ శిరీష, సభ్యులుగా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, వీసీపీసీ చైర్మన్లుగా నరసింహమూర్తి, యామిలి, చైల్డ్ లైన్ ప్రతినిధులుగా సుదర్శన్, జయసుధ, ప్రతినిధి లుగా రాజు, మెడికల్ ఆఫీసర్ శ్రేష్ట, ఎస్సై తిరుపతి రావు, వినోదను ప్రకటించారు.