Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఆకలి తీర్చే అక్షయ పాత్రలా పుట్ట లింగమ్మ ట్రస్టు సేవలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ మండల నా యకులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుట్ట లింగమ్మ ట్రస్ట్ సౌజన్యంలో ఉచిత మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని పరిశీలించి మాటా ్లడారు. ఉచిత భోజనం వేడుకలా ప్రారంభమై, నిరం తర కొనసాగుతు పిల్లల ప్రేమానురాగాలను పొం దడం జరుగుతుందన్నారు. ఒకనాడు కాలే కడుపుల్ని చల్లార్చే భగవంతుడు ఎక్కడా? అని కళాశాల విద్యా ర్థులు ఎదురుచూశారని, నేడు విద్యార్థుల మదిలో చెర గని మధుర జ్ఞాపకంగా తల్లీ లింగమ్మ చేతి రుచులతో అందరికీ అమ్మ ను దర్శింపచేయడానికే ఉచిత మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని,నమ్మిన వ్యక్తిగా తన వంతుగా సాయం అందిస్తున్నాడని అ న్నారు. పరీక్షల ప్రిపరేషన్ సమయంలో ఆకలి చదు వుకు అడ్డురావద్దనే, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందజేస్తున్నారని అన్నారు. ఆరోగ్యం సరిగ్గా లేక చదువు మానేసిన వారున్నారని,విద్యార్థుల చదువు సాఫీగా కొనసాగడానికి అన్నదానం ఉపయోగప డుతుందన్నారు. పుట్ట మధు, విద్యార్థుల పక్షపాతిగా అనేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ మల్కా సూర్య ప్రకాష్‌రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు గోనే శ్రీనివాసరావు, సర్పంచ్ సుంకరి సత్తయ్య, ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, నాయకులు కోట రవి, బండి రాజయ్య, యాదగిరిరావు పాల్గొన్నారు.