Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
స్థలం ఉన్న వికలాంగులకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేయాలని, వికలాంగుల పెన్షన్ను ధరల పెరుగుదలకు అనుగుణంగా రూ.10 వేలకు పెంచాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఏం అడివయ్య డిమాండ్ చేశారు. గురువారం ఎన్పీఆర్డీ హన్మకొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఎం అడివయ్య పాల్గొని మాట్లాడారు. 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులను అవమాన పరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014లో జివో 17ను విడుదల చేసి ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారని అన్నారు. జీఓ-17 అమలు చేయడం వల్ల వికలాంగుల పెన్షన్ల రద్దుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. 2011లో 300 రూపాయలు పెన్షన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పెంచడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ రూ.10వేలకు పెంచాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం గాలికొదిలేశా యని అన్నారు. ఖాళీ స్థలం ఉన్న వికలాంగులకు ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఐదు శాతం వికలంగులకు కేటాయించాలని కోరారు. దరఖాస్తు చేసిన వారికి పరికరాలు రుణాలు వివాహ ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో సైతం వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాల ని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వికలాం గుల చట్టాలు సంక్షేమ పథకాలపై ఫిబ్రవరి 26న జిల్లా సదస్సు వికలాంగుల చట్టాలు సంక్షేమ పథకాలు, 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం పై ఫిబ్రవరి 26న ఏకశిలా పార్క్ అవరనలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సద స్సులో జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ను రూపొందిస్తామని తెలిపారు. జిల్లా సదస్సులో వికలాంగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ నాయకులు ఎం చుక్కయ్య, బి యాకయ్య, బి భాస్కర్, ఉగేందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.