Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-భూపాలపల్లి
మనస్ఫూర్తి ప్రాచీన భారత రాజ్యాంగం అంటూ ఆర్ఎస్ఎస్ మనువాదులు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌బాబు అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో జిల్లా అధ్య క్షుడు ఇసునం మహేందర్ అధ్యక్షతన 'మనువాదం-రాజ్యాంగం' అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో స్కైలాబ్ బాబు పాల్గొని మాట్లాడారు. దేశంలో అన్ని రకాల సమానతలకు మూలమైన మనస్ఫూర్తి మనువాదాన్ని మట్టిలో పాతిపెట్టాలని చట్టం ముందు అందరూ సమానులే అని ప్రకటించిన భారత రాజ్యాంగాన్ని ఐక్యంగా రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. దేశం వెనుకబాటుఉ మనుస్మతి ప్రధాన కారణం అన్నారు. మధ్యయుగాల కాలం నాటి మనుస్మతిని ఆర్ఎస్ఎస్ బీజేపీ తిరిగి ప్రాచీన రాజ్యాంగమని ప్రకటించడాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు. మనువాదులకు మతోన్మాదులకు మనుస్మతి రాజ్యాంగమైతే వాళ్ళు ఈ దేశంలో పౌరులు ఎలా అవుతారని విమర్శించారు. భారతీయులందరికీ భారత రాజ్యాంగమే శిరోధార్యం అన్నారు. మెజార్టీ ప్రజలకు చదువు సంపదలు దూరం చేసిన మనుస్మతి దేశ ప్రజలందరికీ ప్రధాన శత్రువు అన్నారు. రాజ్యాంగ రక్షణకు భారతీయులం దరం ఐక్యం కావాలని, మనువాదులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రాజ్యాంగ హక్కుల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలు కొంత అభివద్ధి సాధించారన్నారు. దీనిని తట్టుకోలేని ఆర్ఎస్ఎస్ మతచాందసవాదులు రాజ్యాంగానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిపై అన్ని ప్రజా సంఘాలు, మేధావులు ప్రజలందరూ ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ను కాల్చి చంపుతామన్న హమారా ప్రసాద్ మాటలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని, హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ మాట్లాడుతూ మహనీయుల మాసంగా ఏప్రిల్ నెల మొత్తం సాంస్కతిక సేవా కార్యాక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈ సెమినార్లో కేవీపీఎస్ జిల్లా నాయకులు కె రవీందర్, శ్రీధర్, మల్లేష్, సదానందం, శ్రీనివాస్ సారయ్య, రాజు, రామచందర్, ఓదన్న, శంకర్, తదితరులు పాల్గొన్నారు.