Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
దేశమంతా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కోరు కుంటుందని, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుంచ డం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని, కెసిఆర్ ఎదురు లేని మనిషి అని మంత్రి దయాకర్ రావు అన్నారు.శుక్రవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కామారెడ్డిగూ డెం బస్టాప్ ఆవరణలో చెట్లను నాటారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా సమీపంలో బిఆర్ఎస్ మండలాద్యక్షులు తీగల దయాకర్ గౌడ్ అధ్వర్యంలో సిఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేకుకట్ చేసి అన్నదానం నిర్వహించారు.దేశంలో, రాష్ట్రంలో, జిల్లా ల్లో, గ్రామాలల్లో ఇవాళ పండుగ చేసుకొని సిఎం కేసీ ఆర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటు న్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే గ్రామాల్లో ఉన్న ప్ర జల్లో మార్పు వచ్చిందని, ఈ మార్పు రాష్ట్రంలో కా కుండా దేశంలో కూడా రావాలని బిఆర్ఎస్ పార్టీ పె ట్టారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాద యాత్రలు చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైకాపా అధ్యక్షురాలు షర్మిల తమపై చేసిన ఆరోపణ లను నిరూపిస్తే రాజీనామా చేస్తానని నిరూపించలేక పోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి, రాజ కీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ చేశారు. నేను పెద్దగా చదువుకోక పోయినా ప్రజల మనోభావాలు చదివి ప్రజల అవసరాలను తీరుస్తున్నానని,అభివృద్ధి చేస్తున్నాను. అందుకే ప్రజలు నన్ను అందుకే గెలిపి స్తూ 6 సార్లు ఓటమి లేకుండా ఎమ్మెల్యేగా,1 సారి ఎంపీగా కూడా గెలిపించారని అన్నారు. నీటి కోసం బాబ్లీకి పోయి, పోలీస్‌లతో దెబ్బలు తిన్ననని,గ్రానైట్ సమస్యలపై పోరాడితే, అనంతపూర్‌లో కేసులు పెట్టారని, నేను ఎక్కడ నిలబడ్డా ప్రజలు నన్ను గెలిపి ిస్తారని అన్నారు. రేవంత్ నీవు నీ కొడంగల్ లో గెలు స్తవా..? అని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో మళ్లీ పోటీ చేస్తావా.. నీవు నా గురించి మాట్లాడే వాడివ య్యావా అని హెచ్చరించారు.నీ గురించి నీ కాంగ్రెస్ వాళ్లే మాట్లాడుతున్నారని,నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే అవుతుందని. గతంలో 15 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు 5 సీట్లు కూడా గెలవలేని స్థితికి రేవంత్ వల్లే వచ్చిందని అన్నారు. మాకు వంద ల ఎకరాల భూములు ఉండే అమ్ముకుంటూ వస్తున్న ని తెలిపారు. ప్రజా సేవ చేస్తున్న ఇప్పుడు 100 ఎక రాలు కూడా లేవని,రాజకీయాల్లో మా నాయిన,నేను మచ్చ లేకుండా ఉన్నామని, మీకు మా గురించి మా ట్లాడే అర్హత, హక్కులు లేవని,మీ పాద యాత్రను నిలిపి వేస్తామని మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పట్టు పడితే,నేనే వద్దని వారించానని తెలిపారు.నేనే ఒకవేళ అడ్డుకావాలనుకుంటే,మీరు జనగామ జిల్లా లో, పాలకుర్తి నియోజకవర్గంలో తిరిగే వారా..? మీ మీ పాద యాత్రలు చేసే వారా..? అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దని, కనీస సంస్కారాన్ని పాటించాలని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బస్వ సావిత్రి మల్లేశం, పల్లా సుందర్ రాంరెడ్డి,ప్రధాన కార్యదర్శి చింత రవి, పిఏసిఎస్ లింగాల ఛైర్మెన్ రమేశ్ రెడ్డి,జిల్లా యువ జన నాయకులు కోతి ప్రవీణ్,వంగ అర్జున్, నియోజ కవర్గ యూత్ అధ్యక్షులు గడ్డం రాజు,జిల్లా గ్రంధాల య డైరెక్టర్ కారుపోతుల బిక్షపతి,పిఎసిఎస్ డైరెక్టర్లు ఇరుకుల సతీష్,కొత్త జెలెందర్ రెడ్డి,జోగు సోమనర్స య్య,కుతాటి నర్సింహులు,మండల యూత్ అధ్యక్షు లు నవీన్,మండల అధికార ప్రతినిధి సుడిగేల హను మంత్,సర్పంచులు బిళ్ల అంజమ్మ యాదవ రెడ్డి,రెడ్డి రాజుల రమేశ్,శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.