Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ డెస్క్
గత 25 రోజుల కాలం నుండి జనగామ పట్ట ణంలోని మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు డబ ల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద చేస్తున్న ఆందోళనలకు స్పం దించిన జిల్లా కలెక్టర్ శివలింగయ్య రెవెన్యూ అధి కారులతో సిపిఎం నాయకులతో ఇందిరమ్మ లబ్ధిదా రులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చర్చలు జరిపి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్య త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావే శానికి జోగు ప్రకాష్ సిపిఎం పట్టణ కార్యదర్శి అధ్యక్ష త వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూగత10 సంవత్సరాల కాలం నుండి ఇండ్ల పట్టాలు పొంది ఇండ్లు లేక కిరాయిల్లో వేలాది రూపాయలు అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడు తున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు మూడో విడత ఇంది రమ్మ పథకం ద్వారా ఇండ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూ పించడం మరిచారని ప్రభుత్వ స్థలంలో చిన్న ఇండ్లు నిర్మించుకున్న ఇండ్లనుఅధికారులు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తా మని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకముందే వార్డుల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని జిల్లా అదికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం విడ్డూరం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆందోళన చేస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారుల వద్దకు జనగాం ఆర్డీ వో మధు మోహన్ మండల తాసిల్దార్ రవీందర్, జనగామ ఎస్ఐ శ్రీనివాస్ వచ్చి వారం రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు రా పర్తి రాజు ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు సుం చు విజేందర్, భూక్య చందు నాయక్, పట్టణ కమిటీ సభ్యులు బాల్నే వెంకట మల్లయ్య, రామవత్ మీట్యా నాయక్, కల్యాణ లింగం, గౌసియా, పొన్నాల ఉమా భవాని, శశిరేఖ, కళ్యాణ్, గణేష్, సురేష్, కనక చారి, భాషపాక విష్ణు, వెంకటేష్ పాల్గొన్నారు.