Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలకు తావులేదు - బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్
నవతెలంగాణ-దేవరుప్పుల
కరువు ప్రాంతమైన పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామ గ్రామాన మంచి నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న ప్రజా నా యకుడు దయన్న అలాంటి ఆయనను టిపిసిసి అధ్య క్షుడు రేవంత్ రెడ్డి విమర్శించడం దయాకర్ రావు కాలిగోటికి కూడా సరిపోడని బీఆర్ఎస్ మండల పా ర్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ అన్నాడు. మండల కేం ద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విమర్శలకు తావు లే దని రాజకీయాలను రాజకీయంగా హుందాగా నడ పాలని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. ముందుగా మీ పార్టీ అభ్యర్థి పాలకుర్తికి ఎందుకు లేరని అన్నారు. కరువు ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఏ టు జెడ్ పనులను పూర్తి చేసి నియోజకవర్గా న్ని అభివృద్ధి చేసిన ఘనత మా దయన్నదే అన్నారు. ట్రస్టు ద్వారా యువతకు కోచింగ్ సెంటర్లను ఏర్పా టుచేసి విద్యాభివృద్ధిని అందిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. జంగా రాఘవరెడ్డి చేసే దొంగ పనులకు రౌడీ వేషాలకు పాలకుర్తి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని, మూడు సంవత్సరాలు నియోజకవర్గంలో కనబడకుండా పోయిన వ్యక్తి పాద యాత్రలో ప్రత్యక్షం అవడం హాస్యాస్పదమన్నారు.
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్
బీఆర్ఎస్ జిల్లా నాయకులు సుందర్ రాంరెడ్డి
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్ అని ఎన్నారై ల దగ్గర కులం పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి తెచ్చు కున్న డబ్బులతో టిపిసిసి అధ్యక్ష పదవి కొనుక్కు న్నాడని బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి అన్నారు.బుధవారం పాలకుర్తి నియోజకవ ర్గంలో చేసింది పాదయాత్ర కాదని 200 కార్లలో 300 మందిని మన వెంట వేసుకొని నోటికి వచ్చిన ట్టు మాట్లాడడం సరైంది కాదని అన్నారు.ఆరుసార్లు ఎమ్మెల్యేగా,ఒక్కసారి ఎంపీగా గెలిచిన దయన్నను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని అన్నారు.మీ సొంత ఊరు కల్వకుర్తి... మీరు పోటీ చేసింది కొడం గల్లో అక్కడ ఓడిపోయి,మల్కాజ్‌గిరిలో పోటీ చేసే నువ్వు దయన్నను వ్యక్తిగత విమర్శలు చేయడం వి డ్డూరంగా ఉందన్నారు. పెయింటర్‌గా జీవితాన్ని మొ దలుపెట్టి కోట్లకు ఎట్లా పడగ ఎత్తారు.మీకు ఓటుకు నోటు ఇంకా ఇలాంటి ఎన్నో కేసులు నీకు,నీ వెంట వచ్చిన జంగా రాఘవరెడ్డి పై ఉన్నాయా లేవా అలాం టి కేసులు ఏమైనా మా దయన్న పై ఉంటే నిరూపిం చగలరు.మీకు దమ్ముంటే పాలకుర్తి నుంచి పోటీ చెరు అప్పుడు తెలుస్తుంది. పాలకుర్తి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేష్,పిఎసిఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి,వైస్ ఎంపీపీ కత్తుల విజరు రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి చింత రవి,నాయకులు అలకుంట్ల యాదగిరి,జలంధర్ రెడ్డి, కోతి ప్రవీణ్, వంగ అర్జున్,కారుపోతుల బిక్షపతి,బోందుగుల సోమయ్య, గుండె రమేష్,ఇంటి మల్లారెడ్డి, జక్కుల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.