Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-హనుమకొండ
రాష్ట్రంలో ప్రకతి పరిరక్షణకు హరిత ఉద్యమాన్ని ఉద్యమంగా చేపట్టిన ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ బాలసముద్రం లోని పార్క్‌లో మేయర్ గుండు సుధారాణితో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు గోదారమ్మ తెలంగాణ చెంతన ఉన్నప్పటికీ ఎడారి, ఆకలి కేకలకు చిరునామాగా తెలంగాణ ఉండేదన్నారు. కేసీఆర్ దఢ సంకల్పంతో రాష్ట్రాన్ని సాధించి గోదారమ్మను బీడు భూములకు మళ్లించి దేశానికి రోల్ మాడల్‌గా రాష్ట్రంను తీర్చిదిద్దార న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 20 శాతం విస్తీర్ణంతో ఉండి దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ 2021 లో రెండవ స్థానానికి చేరుకుం దని అన్నారు. బాలసముద్రంలోని పార్కుకు కెేసీఆర్ ఉద్యానవనంగా నామకరణం చేశామన్నారు. నగరం లోని పార్కులు, జంక్షన్లు, ప్రధాన రహదారులను హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణించాలని, దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,వ ుున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
'సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు'
కాశిబుగ్గ : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు అభివద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్ గ్రౌండ్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రో జులుగా నిర్వహిస్తున్న వేడుకలు శుక్రవారంతో ముగి శాయి. జబర్దస్త్ టీంతో సంబరాలు, తదితర సాంస్క తిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో కూడి న ఎగ్జిబిషన్ ప్రజలను ఆకట్టుకుంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌తో కలిసి ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. లారీ డ్రైవర్ కొడుకునైన తనకు కార్పొరేటర్‌గా, మేయర్‌గా, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.