Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతం చేయాలి
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈ నెల 23న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర పర్యటనలో సింగరేణి కార్మికుల కోసం భూపాలపల్లి ఏరియాలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 994 డబుల్ బెడ్రూం క్వార్టర్లు, జిల్లా కేంద్రంలో పేదల కోసం రూ.50 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. రూ.కోటితో నిర్మించిన గణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ నూతన కార్యాలయ భవనం, మండలంలోని మైలారం వద్ద రూ.6 కోట్లతో డైట్ కళాశాల కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. వీటితోపాటు రూ.2 కోట్లతో జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయం భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.4.50 కోట్లతో చేపట్టిన మినీస్టేడియం పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, బీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్‌కుమార్, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, అర్బన్ మాజీ అధ్యక్షుడు సాంబమూర్తి, ఆలయ చైర్మెన్ గడ్డం కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.