Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పరకాల పట్టణంలో 40 ఏండ్లుగా చేపలు అమ్ముకుంటున్న స్థలంలోనే చేపల మార్కెట్ నిర్మించి మత్స్యకారులను ఆదుకోవాలని టీఎంకేఎఎంకేఎస్ డిమాండ్ చేసింది. శుక్రవారం సంఘం పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ మాట్లాడుతూ.. పరకాల మున్సిపల్ పట్టణంలో కూరగాయల మార్కెట్ రోడ్‌పై 40 ఏండ్లుగా చేపలు అమ్ముకుంటూ 25 మత్స్యకా ర కుటుంబాలు జీవిస్తుని, వారికి చేపల మార్కెట్ నిర్మించి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ స్పందించి తగిన న్యాయం చేస్తామని హామీనిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు నిమ్మల విజేందర్, పరకాల మండల అధ్యక్షులు స్వామి, కార్యదర్శి కుమారస్వామి, బిక్షపతి, అశోక్, సంఘం పరకాల చేపల మార్కెట్ అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి సరోజన, హిమబిందు, శ్యామల తదితరులు పాల్గొన్నారు.