Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
గ్రేటర్ వరంగల్ నూతన కమిటీ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టింది. ప్రెస్ క్లబ్ లో ఉదయం ముందుగా వేదపడింతుల ఆధ్వర్యంలో పూజా, ఆశీ ర్వచణ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొళ్ల అమర్ ఆధ్వర్యంలోఈసీ మీటింగ్ జరిగింది. కార్యద ర్శి ప్రవేశపెట్టిన పలు తీర్మా నాలకు సభ్యులంతా ఆమో దం తెలిపారు. వరంగల్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదంతెలిపారు. అలా గే కాజీపేట, హసన్‌పర్తి మీడియా పాయింట్లకు నిర్వహణ ఖర్చులకోసం నెలవారీగా రూ.10వేలు ప్రెస్‌క్లబ్ చెల్లించాలని నిర్ణ యించారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగే ప్రెస్ మీటింగ్‌ల విష యంలో ప్రెస్క్లబ్హాల్ నిర్వహణ, పారదర్శకంగా ఆ దాయ,వ్యయాల నిర్వహణ తదితర అంశాలపై సుదీ ర్ఘంగా చర్చించారు. ఎన్నికైన కమిటీపైన, గ్రేటర్ వ రంగల్ ప్రెస్ క్లబ్ పైన నిరాధార ఆరోపణలు, సా మాజిక మాధ్యమాలలో వ్యక్తిగత దూషణలు, నిందా రోపణలు చేయకూడదని సూచించింది.
ఎవరైనా అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసు కుంటామని కమిటీ హెచ్చరించింది.నూతన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా స్వీ టు బాక్స్‌ల పంపిణీ, కంటి వెలుగు కార్యక్రమాలు వి జయవంతంగా నిర్వహించడంపై అభినందన తీర్మా నంచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ప్రెసిడెం ట్లు గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను, దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు సంపెట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, బూర్ల నరేందర్, విష్ణువర్దన్, ఈసీలు హరీశ్, శ్రీకాం త్, అంజనేయులు, నయూంపాష, వేణుగోపాల్, దిలిప్, సంజీవ్, భరత్, మంచాల రాజు,విజరురాజ్ పాల్గొన్నారు.