Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుం బానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఎమ్మె ల్యే రాజయ్య అన్నారు. వేలేరు మండల కేంద్రానికి చెందిన బిల్లా రాజు గత కొన్ని నెలలక్రితం ప్రమాదవశాత్తు మతిచెందారు. బిల్లా రాజు బీఆర్ఎస్ పార్టీ క్రియాశీ లక సభ్యత్వం కలిగి ఉండటంతో రూ.2 లక్షల చెక్కు ను అతని భార్య విజయకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూపార్టీ కార్యకర్తలు ప్రమాదవ శాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీ మా సదుపాయం కల్పిస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత, వైస్ ఎంపీపీ సంపత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మరిజె నర్సింగరావు, యువజన సంఘం అధ్యక్షుడు గొవింద సురేష్, మండల సమన్వయకర్త రాజేశ్వర్ రెడ్డి, జోగు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.