Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్‌విప్ దాస్యంకు సీపీఎం జిల్లా కమిటీ వినతి
నవతెలంగాణ-హనుమకొండ
రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి గుడిసె వాసులకు జీవో నెంబర్ 58 ప్రకారం పట్టాలిప్పించాలనిశుక్రవా రం హనుమకొండ బాలసముద్రంలోని క్యాంప్ ఆఫీ స్లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్కి సీపీ ఎం హనుమకొండ జిల్లా కమిటీ ప్రతినిధి బందం వి నతిపత్రాన్ని అందజేశారు. అనంతరం సీపీఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి మాట్లాడుతూ జిల్లా లో 12 కేంద్రాలలో సుమారు 8500 మంది ఇండ్లు లేని నిరు పేదలు ఇంటి కిరాయిలుకట్టలేక ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, వారికి జి.ఓ నెం బర్ 58 ప్రకారం పట్టాలిచ్చి, పక్క గృహలు నిర్మించి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూములలో రియల్ ఎ స్టేట్దారులు కబ్జాలకుచేస్తుంటే ఆ భూములను రక్షిం చడం కోసం ఇండ్లు లేని నిరుపేదలను సమీకరించి గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. కావున మీరు జోక్యం చేసుకొని నిలువ నీడలేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలను ర క్షించి ఆదుకోవాలని ప్రభు త్వ చీఫ్ విప్ ను అయన కోరారు. ఈ భూపోరా టాల సందర్బంగా నాయ కులు, గుడిసెవాసులపై పెడుతున్న అక్రమ కేసుల ను ఎత్తివేయాలని కోరారు. గతంలో ప్రభుత్వ భూము లను రక్షించడానికి అనేక పోరాటాలు చేసి 30 వేల మంది కుటుంబాలకు ప ట్టాలిప్పించిన చరిత్రసిపిఎం పార్టీదని అయన అన్నా రు. పేరుమోసిన హయగ్రీవాచారి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వెలికి తీసి, సుప్రీంకోర్టు వరకు పోరాడి సాధించి ప్రభుత్వానికి అప్పచెప్పిన చరిత్ర సిపిఎం పార్టీదని గుర్తు చేశారు.
పై ప్రాంతాలలో వేసుకున్న భూములను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సర్వ్ చేసి పేదలకు పట్టాలిప్పిం చాల ని కోరారు. స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సీపీఎం ప్రతినిధి బృందంలో జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, జి.ప్రభాకర్ రెడ్డి, గొడుగు వెంకట్, మందసంపత్, కాడబోయిన లింగయ్య తది తరులు పాల్గొన్నారు.