Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఇండ్ల నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ - మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు మున్సిపల్ పరిధిలో నిబంధనల ప్రకారం గృహ నిర్మాణా లు లేకపోతే చర్యలు తీసుకుంటామ ని, కొత్త ఇండ్ల నిర్మాణాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్ తెలి పారు.సోమవారం స్థానిక16వ వార్డు లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణా లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. సెటెబ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఇండ్లకునోటీస్ జారీ చేస్తామన్నా రు. నోటీస్ ముట్టిన మూడు రోజులలో సెట్ బ్యాక్ కాకపోతే మున్సిపల్ నిబంధనల ప్రకారం సిబ్బందిచే నిర్మాణాలు తొలగించి దానికి అగు ఖర్చులు ఇంటి యజమాని నుండి వసూలు చేస్తామన్నారు. మీకు ఏమైనా ఇబ్బంద్ది ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరని అన్నారు. ఆన్లైన్లో పర్మిషన్ తీసు కున్న తర్వాతనే నిర్మాణం చేపట్టాలని, ఫ్రంట్ సైడ్ 1.5 మీటర్స్ సెట్ బ్యాక్, చుట్టూ కూడా వన్ మీటర్ వదిలిపెట్టి నిర్మాణం చేసుకోవాలన్నారు.సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను ప్రతి ఒక్కరూ నిషేధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ రంజిత్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్, రంజిత్, హెల్త్ అసిస్టెంట్ రాజు, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.