Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై సాగిన చర్చ
- మండల అభివృద్ధికి సహకరించాలి
- ఎంపీపీ అంజయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్ డెస్క్
ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి గ్రామీణా ప్రాం తాల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్ర భుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. సోమవారం డివిజన్ కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తూ ర్పాటి చిన్న అంజయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళ పల్లి శ్రీనివాస్, ఎంపీడీవో సింగారపు కుమార్,పలు శాఖల అధికారులు పాల్గొన్న సభలో ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులు ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత అధికారులు సమాధానమిచ్చారు. జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ గిరిజనుల, నిరుపేదల భూములకు పట్టా లు లేకపోవడంతో వారు రైతుబంధు, రైతు బీమా, పిఎం కిసాన్ లాంటి పథకాలకు దూరమవుతున్నారని అన్నారు. అలాగే వెలికట్ట, మాటేడు, మడిపల్లి, ఫతేపు రం తదితర గ్రామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ప్రభుత్వ పన్ను ఎగవేస్తూ ఒక గుంట రెండు గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తూ నాలా పన్ను కట్ట కుండా రైతుబంధు లాంటి పథకాలకు లబ్ధి పొందు తున్నారని ఆరోపించారు. వెంచర్లలో గ్రీన్ ల్యాండ్ తీయకుండా, తీసిన వాటిని మళ్లీ అమ్ముకుంటూ ప్రజ లను మోసం చేస్తున్నారని వీటి పై రెవిన్యూ అధికారు లు దృష్టి సారించాలని కోరారు.
అమ్మాపురం ఎంపీటీసీ విక్రమ్ రెడ్డి మాట్లాడు తూ గ్రామాలలో రైతులు వరి పంటలకు చీడలు వచ్చి ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ అధికారులు సూ చనలు సలహాలు ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయా ల్లోనే సేదతీరుతూ రైతులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రజ లు ఎందుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, విద్యుత్, తాగునీటి సమస్యలపై, ప్రభుత్వం అందిస్తున్న సం క్షేమ పథకాలు, మొదలగు అంశాలపై ప్రజా ప్రతి నిధులు మాట్లాడారు.ప్రజా సమస్యలపై తాము ఎన్ని సార్లు ప్రశ్నించినా అధికారులు సమాధానమే చెబుతు న్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. గ్రా మాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, మొక్కుబడిగా విధులు నిర్వ హిస్తే ఉపేక్షించబోమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని శాఖలకు సంబంధించి చర్చలు, సమస్యల పరిష్కా రంపై అంతంతమాత్రంగానే చర్చలు సాగాయి. అధి కారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయ పరుచు కుంటూ అభివృద్ధి పనుల్లో ముందుకు సాగాలని, అం దరూ సహకారం అందించాలని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య కోరారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు, అభివృద్ధిలో కీలకంగా నిలిచే అధికారులు సభకు తప్పకుండా హాజరుకావా లని, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఎంపీపీ కో రారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగేంద్రప్ర సాద్, వ్యవసాయ రంగంపై ఏఓ కుమార్ యాదవ్, డాక్టర్ మీరాజ్, వెటర్నరీ డాక్టర్ వెంకన్న, ఎంపీఓ గౌస్, ఉపాధి హామీ పనులపై ఏపీఓ పార్థసారధి, వై స్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీలు ఎంపిటి సిల ఫోరం జిల్లా అధ్యక్షుడు డొనుక ఉప్పలయ్య, పల్లె దేవమ్మ, కుంభం సుకన్య, గణేష్, సర్పంచులు శీలం లింగన్న, పందుల యాకయ్య, పాడియా రమేష్, తమ్మడపల్లి సంపత్, పలు అంశాలపై పలు విభాగాల ప్రతినిధులు మాట్లాడారు.